నెటిజెన్ కు తాప్సీ కౌంటర్ – మీకు ప్రతిభ కనిపించదు

Actress Taapsee Pannu Gives Strong Counter To A Netizen In A Recent Chat On Instagram

సెలబ్రిటీస్ ను నెటిజన్స్ కామెంట్స్ చేయడం.. వాటికి సెలబ్రిటీస్ కౌంటర్ లు ఇవ్వడం కామన్ థింగ్. ఒక్కోసారి నెటిజన్స్ కు సెలెబ్రిటీస్ కు సోషల్ మీడియా వేదికగా వర్డ్స్ వారే జరుగుతుంటుంది. ఇప్పటికే చాలామంది నెటిజన్స్ కు తన కౌంటర్ లతో షాకిచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి తాప్సీ కి అలాంటి సంఘటనే ఎదురైంది. నెటిజన్స్ కు తాప్సీ కౌంటర్ లు ఇవ్వడం కొత్తేమి కాదు. అసలు సంగతేంటంటే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం తాప్సీ ‘రష్మి రాకెట్’ చిత్రంలో అథ్లెట్‌గా న‌టిస్తున్నారు. ఈ సందర్భంగా తాప్సీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇందులో తాప్సీ అథ్లెట్‌ దుస్తులు ధరించి మైదానంలో పరుగులు తీస్తూ.. కసరత్తులు చేస్తున్నారు. అవి చూసిన కొంతమంది నెటిజన్లు తాప్సీని ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. అయితే ఒక నెటిజెన్ మాత్రం ఇక నీకు నటన రాదు అంటూనే అభ్యంతరకరమైన పదాలు కూడా వాడి మరి విమర్శించాడు. దీనికి తాప్సీ స్పందించి… ‘అసలు చూపించడం అంటే ఏంటి? ఇంతకి నేను ఏం చూపించానో తెలుసా నా ప్రతిభను‌. కానీ నీకు అది కనిపించదు’ అంటూ చురకలు అంటించారు.

కాగా ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర‌కి ప‌రిచయమైంది తాప్సీ. ఇప్పుడు వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ తన సత్తా చాటుతుంది తాప్సీ. తెలుగులో ఈ అమ్మ‌డికి అంత స‌క్సెస్‌లు లేక‌పోయిన హిందీలో మాత్రం భారీ విజ‌యాల‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది తాప్సీ. తాప్సీ ప్రస్తుతం హిందీలో “హసీన్ దిల్ రుబా “, “లూప్ లపేట్ “, “శభాష్ మిథు ” సినిమాల్లో నటిస్తుండగా.. తమిళ్ లో జయం రవి హీరోగా హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − seven =