పోల్ గేమ్ : సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బెస్ట్ మూవీ ?

Poll Game: Which Is Your Favorite Movie Of Vijay Deverakonda

పెళ్ళి చూపులు: బిగ్ బెన్ సినిమాస్ , ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్స్ పై తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , రీతూ వర్మ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ “పెళ్ళిచూపులు”మూవీ ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న”పెళ్ళిచూపులు”మూవీ తమిళ , మలయాళ , హిందీ భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది. హీరో విజయ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా తరుణ్ భాస్కర్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అర్జున్ రెడ్డి :భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ , షాలిని పాండే జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “అర్జున్ రెడ్డి “మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఫ్రస్టేటెడ్ లవర్ గా విజయ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. స్వచ్ఛమైన ప్రేమలోని తీవ్రత , అది విఫలం అయినప్పుడు కలిగే బాధను అద్భుతంగా తెరకెక్కించి దర్శకుడు సందీప్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

గీత గోవిందం : GA 2 పిక్చర్స్ బ్యానర్ పై పరశురామ్ దర్శకత్వంలో విజయ్ , రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ “గీత గోవిందం ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. “గీత గోవిందం “మూవీ లో విజయ్ ఫ్రెష్ లుక్ లో కనిపించి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు పరశు రామ్ మూవీ ని ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ తో హీరో విజయ్ , హీరోయిన్ రష్మిక స్టార్ డమ్ అందుకున్నారు.

టాక్సీవాలా: GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో విజయ్ , ప్రియాంక జువాల్కర్ , మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ “టాక్సీవాలా “మూవీ ఘనవిజయం సాధించింది. క్యాబ్ డ్రైవర్ గా నటించిన విజయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మంచి స్టోరీ లైన్ తో , కామెడీ సన్నివేశాలతో దర్శకుడు రాహుల్ “టాక్సీవాలా “మూవీ ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు.

[totalpoll id=”51888”]

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.