బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : ప్రభాస్ బెస్ట్ మూవీ ?

Which Among These Is Your Favorite Movie Of Rebel Star Prabhas?

వర్షం : సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ , త్రిష జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “వర్షం ” మూవీ ఘనవిజయం సాధించింది. రొమాంటిక్ సీన్స్ , యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రభాస్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బెస్ట్ ఫిల్మ్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న “వర్షం “మూవీ తమిళ , హిందీ భాషలలో రీమేక్ జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఛత్రపతి : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , శ్రియ జంటగా రూపొందిన “ఛత్రపతి ” మూవీ ఘనవిజయం సాధించింది. యాక్షన్ సీన్స్ , ఎమోషనల్ సీన్స్ లో సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసి ప్రభాస్ మూవీ టైటిల్ “ఛత్రపతి “కి నూరు శాతం న్యాయం చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

మిర్చి : యు వి క్రియేషన్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ , అనుష్క జంటగా రూపొందిన యాక్షన్ , కామెడీ “మిర్చి ” మూవీ ప్రేక్షకాదరణ పొందింది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో హీరో ప్రభాస్ మెచ్యూర్డ్ గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “మిర్చి ” మూవీ 6 నంది అవార్డ్స్ అందుకుంది.

బాహుబలి : ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో 2 భాగాలుగా రూపొందిన “బాహుబలి ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ తో దర్శకుడు రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ను చాటిచెప్పారు. భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.

సాహో: యు వి క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ , శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో” మూవీ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. ప్రపంచవ్యాప్తంగా 433 కోట్లు కలెక్ట్ చేసి “సాహో” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : ప్రభాస్ బెస్ట్ మూవీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 1 =