బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : ప్రభాస్ కు బెస్ట్ జోడీ ?

Birthday Special Poll Game: Which Of These Actress Can Make The Best Pair With Darling Prabhas?

అనుష్క: ప్రభాస్ , అనుష్క జంటగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “బిల్లా”, యాక్షన్ కామెడీ “మిర్చి “, ఎపిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ ఘనవిజయం సాధించాయి. వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండి ప్రేక్షకులను అలరించింది. రీల్ లైఫ్ లో జోడీ కట్టిన ప్రభాస్ , అనుష్క రియల్ లైఫ్ లో కూడా జోడీ కట్టాలని అభిమానుల కోరిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్రిష: ప్రభాస్ , త్రిష ఫస్ట్ టైమ్ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “వర్షం ” మూవీ ఘనవిజయం సాధించింది. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తరువాత “బుజ్జిగాడు “, “పౌర్ణమి” మూవీస్ లో నటించారు. టాలీవుడ్ లో బ్యూటిఫుల్ పెయిర్ గా పేరుపొందారు.

కాజల్ అగర్వాల్ : ప్రభాస్ , కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీస్ “డార్లింగ్ “, “Mr పర్ ఫెక్ట్ ” ఘనవిజయం సాధించాయి. వారిద్దరి మధ్య తెరకెక్కిన సీన్స్ ఎంటర్ టైనింగ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ లో ప్రభాస్ , కాజల్ బెస్ట్ పెయిర్ గా నిలిచారు.

తమన్నా: ప్రభాస్ , మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా రూపొందిన “బాహుబలి “, బాహుబలి 2 ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ మూవీస్ లో ప్రభాస్ , తమన్నా స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతంగా తెరకెక్కిన వారిద్దరి మధ్య సీన్స్ ప్రేక్షకులను అలరించాయి. వారిద్దరూ జంటగా “రెబెల్ ” మూవీ రూపొందింది.

నయనతార: ప్రభాస్ , నయనతార జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా “యోగి ” మూవీ విజయం సాధించింది. ఈ మూవీ లో వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెనడా , ఈజిప్ట్ , మలేసియా లలో తెరకెక్కిన సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. వీరిద్దరి జంట ఈ మూవీ లో చూడ ముచ్చటగా ఉంది.

శ్రియ: ప్రభాస్ , శ్రియ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఛత్రపతి ” మూవీ ఘనవిజయం సాధించింది. వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. హీరోయిన్ శ్రియ క్యూట్ గా ఉండి హీరో ప్రభాస్ కు జోడీ గా పర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. యాక్షన్ సీన్స్ లోనూ , ఎమోషనల్ సీన్స్ లోనూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రభాస్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : ప్రభాస్ కు బెస్ట్ జోడీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + twelve =