లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు నిర్మాత , దర్శకుడు , రైటర్ , కొరియోగ్రాఫర్ గా నాలుగున్నర దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “బాబు “(1975 ) మూవీ తో రాఘవేంద్ర రావు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. స్టార్ హీరోలతో తెలుగు , హిందీ భాషలలో 100 పైగా మూవీస్ దర్శకత్వం వహించి , పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అనేక ఆణిముత్యాలవంటి మూవీస్ కు దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు ఇప్పుడు ఒక మూవీ ని ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేశారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#PelliSandadi…
మళ్ళీ మొదలవ్వబోతుంది….
తారాగణం త్వరలో… pic.twitter.com/fvOqagnhpT— Raghavendra Rao K (@Ragavendraraoba) October 9, 2020
కె . కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్ కె ఫిల్మ్ అసోసియేట్స్ , ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్ పై రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పెళ్ళి సందడి ” మూవీ రూపొందనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. “పెళ్ళి సందడి “మొదలవ్వబోతుంది , తారాగణం త్వరలో” అంటూ దర్శకుడు రాఘవేంద్ర రావు ట్వీట్ చేశారు. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “పెళ్ళి సందడి “(1996) బ్లాక్ బస్టర్ మూవీ తో ప్రేక్షకులను అలరించిన రాఘవేంద్ర రావు మరోసారి “పెళ్ళి సందడి ” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: