ఓటీటీ పై విసుగు – థియేటర్స్‌ ఓపెన్‌ చేసే టైమ్ వచ్చింది

Director Nag Ashwin Feels Bored Of Watching Movies On OTT Websites

కరోనా వల్ల థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే కదా. సినిమాల షూటింగ్స్ అయితే మొదలు పెట్టారు కానీ థియేటర్స్ మాత్రం ఎప్పుడు తెరుచుకుంటాయి తెలీదు. ఇక ఓటీటీలో సినిమాలు ఉన్నా కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే. ఎంత ఓటీటీలో సినిమాలు చూసినా సినీ లవర్స్ కు మాత్రం థియేటర్స్ లో ఆ సినిమా చూస్తేనే అదో కిక్. మరోపక్క ప్రభుత్వం థియేటర్స్‌ ఓపెన్‌ చేయాలంటూ సినీ ఇండస్ట్రీ నుండి పలువురు పెద్దలు కోరుకుంటున్న సంగతి కూడా తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు అదే కిక్ మిస్ అవుతుంది అంటున్నాడు నాగ్ అశ్విన్. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా చేయగా ఇప్పుడది వైరల్ గా మారింది. జిమ్స్‌, బార్స్‌, రెస్టారెంట్స్‌, మాల్స్‌, గుళ్లు, బస్సులు, మెట్రో రైళ్లు, ఫ్లైట్స్..అన్నీ ఓపెన్‌ అయ్యాయి. ఇప్పుడు థియేటర్స్‌ ఓపెన్‌ చేసే సమయం వచ్చింది. మాస్క్‌ ధరించి సినిమాలు చూడటానికి వెయిట్‌ చేయలేకపోతున్నాను” అంటూ నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ చేశారు.

 

కాగా ‘ఎవడే సుబ్రమణ్యం’తో డైరెక్టర్‌గా ప్రూవ్‌ చేసుకున్న నాగ్‌ అశ్విన్‌ రెండో చిత్రం ‘మహానటి’తో జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.