రెజీనా నమ్మిన సిద్ధాంతం

Actress Regina Cassandra Firmly Believes In This Policy

తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రెజీనా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “ఏక్ లడికీ కో దేఖా తో ఐసా లగా ” మూవీ తో రెజీనా బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రీసెంట్ గా సూపర్ హిట్ “ఎవరు ” మూవీ తో ప్రేక్షకులను అలరించిన రెజీనా 5 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సైకాలజీ లో గ్రాడ్యుయేట్ అయిన రెజీనా 9 సంవత్సరాల వయసులోనే ఒక కిడ్స్ ఛానల్ కు యాంకర్ గా పనిచేశారు. కొన్ని యాడ్స్ లో నటించిన రెజీనా తన 16 సంవత్సరంలో నటిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. చిత్ర పరిశ్రమలోరాణించాలంటే కథానాయికలకు అందం , అభినయం తో పాటు అదృష్టం కూడా కలసి రావాలని అందరూ అనుకొంటారు. కొంతమంది కథానాయికలు ఆ విషయాన్ని పట్టించుకోరు. ఆ కోవకు చెందిన హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ .. కెరీర్ లో , జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కడానికి ప్రయత్నించాలనీ , వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలనీ , అప్పుడు జీవితం విలువ తెలుసుకునే అవకాశం కలుగుతుందనీ , అదే తాను నమ్మిన సిద్ధాంతం అనీ , కెరీర్ సంతృప్తికరంగా ముగించాలన్నదే తన కోరిక అనీ , తన ఆత్మ సంతృప్తి , సెల్ఫ్ గ్రోత్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాననీ రెజీనా చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.