కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. థియేటర్స్ మూతబడి , మూవీ రిలీజ్ లు ఆగిపోయి, షూటింగ్స్ నిలిచిపోయి చిత్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది కార్మికులు ఇబ్బందులు పడ్డారు . ఓపెనింగ్స్ , రిలీజ్ ఫంక్షన్స్ , షూటింగ్స్ తో బిజీగా వుండే సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయ్యారు. కొన్ని నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కు అనుమతి ఇచ్చినా ఒకటి లేదా రెండు చిత్రాలు తప్ప పెద్ద హీరోల సినిమాలు సెట్స్ పైకి వెళ్ళలేదు. కరోనా వ్యాప్తి కారణంగా స్టార్ హీరో , హీరోయిన్స్ షూటింగ్స్ లో పాల్గొనడానికి వెనుకంజ వేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుమారు 6 నెలల తరువాత టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి మొదలయింది. కింగ్ నాగార్జున “వైల్డ్ డాగ్ ” మూవీ షూటింగ్ లో పాల్గొనడంతో పలు మూవీస్ షూటింగ్ పునః ప్రారంభం అయ్యాయి. నాగచైతన్య “లవ్ స్టోరీ “, సాయి తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్ “, “జాంబీ రెడ్డి “, ఓదెల రైల్వే స్టేషన్” , “బ్లాక్ రోజ్ , క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ తేజ్ , రకుల్ జంటగా రూపొందుతున్న మూవీ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న “గుడ్ లక్ సఖి “మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. మహేష్ బాబు , వరుణ్ తేజ్ వాణిజ్య ప్రకటనల షూటింగ్ లలో పాల్గొన్నారు. అక్టోబర్ నెలలో మరిన్ని మూవీస్ షూటింగ్స్ జరుపుకోనున్నాయని సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: