“పడై వీరన్ ” మూవీ తో కోలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయిన అమృత అయ్యర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన “కాళి ” మూవీ లో నటించిన అమృత స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందిన బ్లాక్ బస్టర్ “బిగిల్ “తమిళ మూవీ లో ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గుర్తింపు పొందారు. అమృత ప్రస్తుతం “లిఫ్ట్ “తమిళ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ యాంకర్ ప్రదీప్ హీరోగా రూపొందిన “30 రోజులలో ప్రేమించడం ఎలా ?” మూవీ తో అమృత టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే రామ్ పోతినేని హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED ” మూవీ లో అమృత ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరిగా నటించడం విశేషం. ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న అమృత తన అభిమానులతో “ఆస్క్ మీ ఎనీ థింగ్ ” చిట్ చాట్ లో పాల్గొన్నారు. మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత తన ఫేవరేట్ హీరోయిన్ అనీ , సమంత నటన , ఆమె చేసే మంచిపనులకు సమంత అభిమాని గా మారాననీ అమృత జవాబు ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: