సమంత సీడింగ్ టిప్స్

Samantha Akkineni Shares Interesting Gardening Tips On Instagram

స్టార్ హీరోయిన్ సమంత గార్డెనింగ్ పై ఆసక్తి తో తన ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూర గాయలు పండిస్తూ లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాను పండించిన పంటలను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులకు ప్రేరణ కలిగిస్తున్నారు.
“ది ఫ్యామిలీ మెన్ “వెబ్ సిరీస్ లో నటించిన సమంత ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ఇచ్చారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత అభిమానులకు సీడింగ్ టిప్స్ చెబుతూ ఒక వీడియో రూపొందించి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. మొక్కలు సక్రమంగా పెరగాలంటే మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలనీ , నకిలీ విత్తనాలు బరువు తక్కువగా ఉంటాయనీ , నీటిలో తేలుతాయనీ , ఎక్స్ పైరీ డేట్ చూసుకుని విత్తనాలు కొనాలనీ , విత్త నాలను కూల్ , డ్రై ప్లేస్ లలో స్టోర్ చేయాలనీ, నాటే ముందు విత్తనాలను కొన్ని గంటల పాటు నాన బెట్టాలని , నేలను పొడిగా ఉంచుకోవాలనీ , సీడ్స్ ఒకటి లేదా రెండు సెంటీ మీటర్ లలో నాటాలని, రెండు , మూడు రోజుల తరువాత పై పైన తడపాలనీ , మూడు లేదా నాలుగు ఆకులు వచ్చిన తరువాత కుండీ లలో , ట్రే లలో మార్చాలనీ చెప్పారు. చివరగా మొక్కలను ప్రేమించండి , అవి మిమ్మల్ని ప్రేమిస్తాయని సమంత చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =