బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌటేలా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది స్నేహితుడు మోహన్ భరద్వాజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఊర్వశి రూటేలా లీడ్ రోల్ లో నటిస్తోంది.. అంతేకాదు ఈ సినిమాకు ‘బ్లాక్ రోస్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఓకే షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా సంపత్ నంది తన ట్విట్టర్ ద్వారా తన ఫ్రెండ్ మోహన్ భరద్వాజకు గుడ్ లక్ చెపుతూ ట్వీట్ చేశాడు. డియర్ ఫ్రెండ్ మోహన్ భరద్వాజ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభిస్తున్న నీకు గుడ్ లక్… నా నిర్ణయం సరైనదేనని నువ్వు అనుకునేలా చేస్తావని నేను నమ్ముతున్నా… శ్రీనుకు ధన్యవాదాలు. నా మీద నమ్మకముంచి డైరెక్టర్ గా మోహన్ భరద్వాజకు అవకాశమిచ్చిన పవన్ కు కృతజ్ఞతలు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని సంపత్ నంది ట్వీట్ చేశారు. ఊర్వశి రౌటేలా.. మోహన్ భరద్వాజతో ఇతర బృందంతో కలిసి ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
Dear friend @mohanbharadwaja.. good luck on ur career as a director👍🏾hope n believe you will make me n my decision proud. Extremely thankful to #Srinu garu and #Pawan garu for accepting my proposal and giving him an opportunity. Indebted forever🙏🏾🙏🏾🙏🏾#BlackRose @SS_Screens pic.twitter.com/VEuM3AoKsT
— Sampath Nandi (@IamSampathNandi) August 18, 2020
ప్రస్తుతం సంపత్ నంది హీరో గోపీచంద్ తో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సంవత్సరంలో మొదలయిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. దీనితో పాటు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ తో మరో సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాకు సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: