#NTR30 మూవీ లో కీలక పాత్రలో మోహన్ లాల్ ?

Malayalam Super Star Mohan Lal To Play A Pivotal Role IN NTR 30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం “మూవీ లో కొమరం భీం గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . బ్లాక్ బస్టర్ “KGF చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ మూవీ కి కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హారిక &హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా #NTR30 మూవీ రూపొందనుంది. ఈ మూవీ కి “అయినను పోయి రావలె హస్తినకు “టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ హీరోగా రూపొందనున్న ఈ మూవీ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో నటించనున్నారని , నెగటివ్ షేడ్స్ ఉన్న పొలిటికల్ లీడర్ పాత్ర అని , తాను నమ్మిన దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధ పడే పాత్ర అని సమాచారం. ఎన్టీఆర్ , మోహన్ లాల్ కాంబినేషన్ లో రూపొందిన “జనతా గ్యారేజ్ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + eleven =