మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం అత్యంత కీలకమైన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరుతో కొన్ని సేవా, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు తెగ హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు .ఈనెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారన్న వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ ఆఫీస్ క్లారిటీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘RAW NTR’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక స్వతంత్ర సంస్థకు, జూనియర్ ఎన్టీఆర్కు గానీ, ఆయన కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదని ఈ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు గానీ, ఆయన పేరుతో ప్రకటనలు చేయడానికి, కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ ‘RAW NTR’ కు ఎలాంటి అధికారమూ లేదని తేల్చి చెప్పారు.
ఎన్టీఆర్కు సంబంధించిన సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు లేదా ఇతర ఏ అధికారిక ప్రకటనలైనా కేవలం ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడిస్తారని తెలిపారు. అనధికారిక వ్యక్తులు, సంస్థలు చేసే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని, ఇది ఈ అంశంపై తమ చివరి వివరణ అని స్పష్టం చేశారు.
సాంప్రదాయ మీడియా, డిజిటల్, సోషల్ మీడియా వేదికలు మరియు అభిమానులు కూడా ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా కేవలం అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారాన్నే నమ్మాలని కోరారు.దాంతో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అంటూ వచ్చిన వార్తలకు చెక్ పెట్టినట్లయింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























