రోజు రోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో వేలాది మంది కరోనా బారిన పడుతున్నారు. సెలబ్రెటీలనుండి , సామాన్యుల వరకు ఎవర్నీ ఈ వైరస్ వదిలిపెట్టట్లేదు. ఇక టాలీవుడ్ లో కొందరు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బండ్ల గణేష్, రాజమౌళి, తేజ ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. బండ్ల గణేష్ కోలుకోగా రాజమౌళి, తేజ ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్ లోనే వుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా సింగర్ స్మిత కు పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. బాడీ పెయిన్స్ రావడంతో ముందు వర్కౌట్స్ వల్ల వస్తున్నాయేమో అనుకున్నా.. కానీ టెస్ట్ లు చేయించుకుంటే మంచిదని చేయించుకున్నాం… టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది.. తనతో తన భర్త శశాంక్ కు కూడా పాజిటివ్ వచ్చినట్టు చెప్పింది. అంతేకాదు తమకు కరోనా లక్షణాలు పెద్దగా కనిపించలేదని.. ఇంట్లోనే ఉన్నా కూడా కరోనా వచ్చిందని త్వరలోనే కరోనా వైరస్ ని తాము తరిమికోడతామని చెప్పారు. ఈ సందర్భంగా అందరూ ప్లాస్మా దానం చేయాలి అని ఆమె పిలుపునిచ్చారు.
Mad mad day yesterday. Had some body pains which I thought was due to heavy workout but got tested to be on safe side. Shashank & I tested covid positive. Mostly asymptomatic. Waiting to kick Covid out, donate plasma & chill🤘🏼 We Stayed Home Stayed Safe but Covid came home 😁
— Smita (@smitapop) August 4, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: