ఏ యంగ్ హీరో సిక్స్ ప్యాక్ బాడీ కి మీ ఓటు ?

సాధారణం గా సినీ సెలబ్రిటీస్ ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇస్తారన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగ పరచుకొని కొంతమంది యంగ్ హీరోలు సిక్స్ ప్యాక్ అబ్స్ సాధించి, తమ రాబోయే మూవీస్ లో ప్రేక్షకులను అలరించనున్నారు. వారిలో కొంతమంది హీరోల సిక్స్ ప్యాక్ బాడీస్ ను చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తికేయ : సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుని కార్తికేయ అభిమానులను సంపాదించుకున్నారు. తమ క్రేజీ హీరో కార్తికేయ మూవీస్ కై అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తారు. “హిప్పీ “, గుణ 369 “, “90 ఎమ్ ఎల్ ” మూవీస్ లో తనదైన స్టైల్ లో కార్తికేయ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో నాని మూవీ లో విలన్ గా నటించిన కార్తికేయ ఇప్పుడు “చావు కబురు చల్లగా ” మూవీ లో బస్తీ బాలరాజు గా ఒక మాస్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆ మూవీ కై కార్తికేయ సిక్స్ ప్యాక్ అబ్స్ ను సాధించారు.

నాగశౌర్య : సక్సెస్ ఫుల్ “చందమామ కథలు ” మూవీ తో నాగశౌర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఊహలు గుస గుస లాడే “, “జ్యో అచ్యుతానంద” , ” ఛలో”, “ఓ బేబీ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ &సస్పెన్స్ థ్రిల్లర్ “అశ్వథ్థామ”మూవీ లో యాక్షన్స్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగశౌర్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం ఒక స్పోర్ట్స్ డ్రామా లో ఆర్చర్ గా నటిస్తున్నారు. ఫ్లోర్ ఎక్సర్ సైజ్ లతో సిక్స్ ప్యాక్ సాధించానని నాగశౌర్య చెప్పారు.

నిఖిల్ : సూపర్ హిట్ “హ్యాపీ డేస్ “మూవీ తో నిఖిల్ టాలీవుడ్ లో ప్రవేశించారు. “స్వామి రా రా “, “కార్తికేయ “, “ఎక్కడికి పోతావు చిన్నవాడా”, “అర్జున్ సురవరం ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో నిఖిల్ ప్రస్తుతం “కార్తికేయ 2 ” , “18 పేజెస్ ” మూవీస్ లో నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ “కార్తికేయ ” మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీ కై నిఖిల్ సిక్స్ ప్యాక్ అబ్స్ ట్రై చేశారు.

సుధీర్ బాబు: సూపర్ హిట్ “ఏ మాయ చేసావె ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సుధీర్ బాబు “ప్రేమ కథా చిత్రమ్ “, “సమ్మోహనం ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చాలా కాలంగా సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ అబ్స్ ను మెయిన్ టైన్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో తన ఇంటిలో చేసిన వర్కౌట్ వీడియోస్ ను సుధీర్ బాబు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.

ఏ యంగ్ హీరో సిక్స్ ప్యాక్ బాడీ కి మీ ఓటు ?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − five =