2021 సంక్రాంతికి ‘కె.జి.యఫ్2’..?

KGF 2 To Hit Theatres For 2021 Sankranthi

కరోనా కారణంగా అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోవడంతో… దాని ప్రభావం సినిమాల రిలీజ్ లపై కూడా పడింది. దీనివల్ల కె.జి.యఫ్2 సినిమా రిలీజ్ లో మార్పులు వచ్చాయి. అయితే ఈ సీక్వెల్ కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కారణంగా ఈ సినిమా రిలీజ్ పై ఎప్పుడూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది. ప్రస్తుతం కె.జి.యఫ్2 సినిమా షూటింగ్ దశలో వుంది. దాదాపు చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. పరిస్థితులు బాగుండి వుండే మరో రెండు మూడు నెలల్లో రిలీజ్ అయ్యేదే. అయితే చిత్రయూనిట్ మాత్రం తొందర్లోనే సినిమా రిలీజ్ చేస్తామంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేయాలని చేస్తున్నారట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కె.జి.యఫ్ టీమ్ క్లారిటీ ఇచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా అధీర లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. లుక్కే ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. దానికి తోడు కె.జి.యఫ్ కంటే ఐదురెట్లు అంతకుమించి అనేలా ఉంటుందని చెప్పాడు యష్ ఇటీవలే. మరి ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను చూడాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి చూద్దాం ఇది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో…ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − nine =