లాక్‌డౌన్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. యంగ్ హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. హీరో నిఖిల్ రెండు నెలల క్రితం గర్ల్ ఫ్రెండ్ అయిన డాక్టర్ పల్లవిని వివాహం చేసుకున్నారు. ఇక గత నెలలో మరో యంగ్ హీరో నితిన్ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది సెలబ్రిటీల వివాహం జరిగింది. తాజాగా మరో డైరెక్టర్ కూడా ఒక ఇంటివాడయ్యాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సాహో డైరెక్టర్ సుజీత్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డైరెక్టర్ సుజీత్ తన ప్రియురాలు ప్రవల్లికను నిన్న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. కరోనా నేపథ్యంలో పెళ్ళికి చాలా కొద్దిమంది హాజరైనట్లు తెలుస్తుంది. జూన్ లో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
రన్ రాజా రన్ తో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సుజీత్ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో భారీ బడ్జెట్ సినిమా ‘సాహో’ తీసి ఈ సినిమాతో ఏకంగా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ నమ్మకంతోనే మెగాస్టార్ తన లూసిఫర్ భాద్యతలు సుజీత్ కు అప్పంగించారు. సుజీత్ ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ స్క్రిప్ట్‌తో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: