ఆ రెండు కారణాల వల్లే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చేశాను..!

Actor Satyadev Reveals The Reasons Behind Accepting His Role In The Movie Uma Maheshwara Ugra Roopasya

మొదటి నుండి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య దేవ్. ఏపాత్ర అయినా సరే దానికి పూర్తి న్యాయం చేసే నటుడు. అందుకే చిన్న చిన్న పాత్రల నుండి ఇప్పుడు హీరోగా చేసే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతో వచ్చాడు. మలయాళ చిత్రం ‘మహేషింటే ప్రతీకారమ్‌’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అయి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘ది తెలుగుఫిలింనగర్.కమ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్.. అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.. ఈ పాత్ర కోసం ఎలాంటి ప్రిపరేషన్ తీసుకున్నారు అని అడుగగా.. ఈ సందర్భంగా సత్య దేవ్ మాట్లాడుతూ… నిజం చెప్పాలంటే ఈ సినిమాపై అంచలనాలు బాగానే ఉన్నాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమాను రీమేక్ చేయాలంటే అంత ఈజీ కాదు చాలా కష్టం.. నువ్వు ఎంత బాగా నటిస్తావు.. ఎంత బాగా సినిమా తీస్తావు అన్నది కాదు. ఆల్రెడీ మాతృక సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల అంచనాలను రీచ్ అవ్వాలంటే చాలా స్ట్రెస్ తో కూడుకున్న విషయం. మొదట నేను డైరెక్టర్ అదే ఆలోచనలో ఉన్నాం.. అప్పుడు ఇలా అయితే మనం సినిమా తీయలేము అని ఆలోచించి అయితే ఆ తర్వాత ఆ ఆలోచనలు అన్నీ మైండ్ లోనుండి తీసేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేసి సినిమా తీశామని చెప్పాడు.

ఈ సినిమా చేయడానికి అంగీకరించడానికి కారణం డైరెక్టర్ మహా వెంకటేష్ ఫస్ట్ రీజన్. ఇంకోటి ఈ సినిమా కూడా నాకు బాగా నచ్చడం. ఈ రెండు విషయాలు నేను ఈ సినిమా చేయడానికి కారణాలు. మహా డైరెక్షన్ ఎలా ఉంటుందో కేరాఫ్ కంచరపాలెం సినిమాలో చూశాం. ఒక యాక్టర్ నుండి సహజమైన నటన ఎలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు.. నాకు తెలిసి ఈ సినిమాను మహా తప్పా ఇంకెవరూ అంత నేచురల్ గా తీయలేరు అని చెప్పాడు.

కాగా ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో నరేశ్‌, సుహాస్‌, జబర్దస్త్‌ రామ్‌ ప్రసాద్‌, టీఎన్‌ఆర్‌, రవీంద్ర విజయ్‌, రాఘవన్‌ ఇందులో ముఖ్యపాత్రలు పోషించారు. జాతీయ అవార్డు గ్రహీత మలయాళం లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించిన బిజిబల్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here