కట్టప్ప పాత్ర ఫస్ట్ ఛాయస్ బాలీవుడ్ హీరో అట..!

Satyaraj Was Not Our Initial Choice For Kattappa Character In Bahubali Movie

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఈ ప్రశ్న లేకుండా బాహుబలి లేదు… బాహుబలిని తలుచుకున్న వెంటనే మనకు మొదట గుర్తొచ్చే ప్రశ్న ఇదే. అయితే దానికి సమాధానం మనకు దొరికిందనుకోండి. ఇక కట్టప్ప పాత్రలో సత్యరాజ్ నటన గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. మాహిష్మతి రాజ్యానికి కట్టుబానిసలాగా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ పూర్తిగా ఒదిగిపోయాడు. ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన పాత్రలో సత్య రాజ్ కాకుండా వేరొకళ్ళని ఊహించుకోవడం కష్టమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ కట్టప్ప పాత్ర కోసం రాజమౌళి ముందు వేరే నటుడిని అనుకున్నాడట. ఆ నటుడు ఎవరో కాదు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌. కట్టప్ప పాత్ర కోసం రాజమౌళి సంజయ్ దత్ ను తీసుకోవాలనుకున్నాడట. అయితే ఆ సమయంలో సంజయ్ దత్ జైలులో ఉండటంతో సత్య రాజ్ ను ఎంపిక చేశారట. మరి సంజయ్ దత్ ఎలా చేస్తాడో తెలియదు కానీ సత్యరాజ్ మాత్రం కట్టప్ప పాత్రకి న్యాయం చేసాడు. ఆ పాత్రలో వేరే వాళ్ళని కూడా వూహించుకోలేము.

ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నాలు ముఖ్య పాత్రల్లో నటించారు. రమ్యకృష్ణ గురించి చెప్పేదేముంది. శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటన అద్భుతం. పాత్రలు, కథ కథనాలు, సంగీతం ఇలా అన్ని కుదిరాయి కాబట్టే తెలుగు సినీ చరిత్రలో బాహుబలి ఒక మైలు రాయిగా మిగిలింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 5 =