‘118’ లాంటి థ్రిల్లర్ తో హిట్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ ఆ తర్వాత చేసిన ‘ఎంత మంచివాడవురా’ సినిమాతో హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం మల్లాది వేణు డైరెక్షన్ లో తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేశారు కానీ.. కరోనా వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ’ఒక్క క్షణం’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, డిస్కోరాజా’ వంటి ఢిఫరెంట్ సినిమాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇటీవలే వీఐ ఆనంద్ ఓ కథను వినిపించగా అది కళ్యాణ్ రామ్ కు వినిపించగా అది తనకు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా వుండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్. కోనేరు నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఉన్న సినిమా అయిపోయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకుళ్లనున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
మరోవైపు కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా నిర్మించనున్నాడు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా తెరకెక్కించనున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: