మొదటి నుండి భారీ బడ్జెట్ తో.. పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ కమర్షియల్ సినిమాలు తీసినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పొచ్చు. అయితే తమిళ్ లో హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమా తెలుగులో ‘రాక్షసుడు’ గా రీమేక్ సక్సెస్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తర్వాత ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాను లైన్ లో పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా కరోనా వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలు పెడుతుండటంతో ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెడదామని చూస్తున్నారట. జులై మొదటి వారంలో ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటిస్తూ షూటింగ్ కు వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. మొదట బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకా కీలక నటీనటులపై చిత్రీకరణ జరుపనున్నారట. ఆ తర్వాత రెండు వారాలకు హీరోయిన్ నభా నటేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తుండగా..ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: