ఒరేయ్ బుజ్జిగా – మళ్లీ ప్రమోషన్స్ షురూ

Orey Bujjiga Movie Team Kickstarts Movie Promotion Work

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల రిలీజ్ సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. అయితే మధ్యలో ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక వార్తను నిర్మాత ఖండించడం కూడా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అప్పట్లో బాగానే చేశారు. అయితే ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు చేశారు. సినిమా షూటింగ్స్ కూడా చిన్నగా మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మళ్ళీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగా.. ఈ చిత్రంలోని ‘సరిగమప’ అనే సాంగ్ ప్రోమోని శనివారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను చిత్రయూనిట్ అధికారికంగా విడుదల చేశారు. ఈ పాట రాజ్ తరుణ్, హెబా పటేల్‌లపై ఉండబోతోన్నట్లుగా ఈ పోస్టర్ చూస్తే తెలుస్తుంది.

కాగా మాళవిక నాయర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =