విశాల్ హీరోగా సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘చక్ర’. బ్యాంక్ రాబరీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఫుల్ టెక్నికల్ విలువలతో కొత్త కథ-కథనాలతో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా కరోనా వల్ల ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న విశాల్ ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రీసెంట్ గా ఫస్ట్ లుక్ ను, గ్లింప్స్ ఆఫ్ ట్రయిలర్ ను రిలీజ్ చేయగా…తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జూన్ 27వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ నాలుగు భాషల్లో ఒక్కసారే ఈ ట్రయిలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
Excited to Announce that our movie #Chakra’s Trailers will be launched this Saturday in 4 South Indian Languages#VishalChakra #ChakraTrailer pic.twitter.com/mgxndhR5oS
— Vishal (@VishalKOfficial) June 24, 2020
ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్ రెజీనా కసాండ్ర, మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: