సోషల్ మీడియా లో నాకు ఏ అకౌంట్స్ లేవు

I Do Not Have Any Social Media Accounts Says Tollywood Actor Rao Ramesh
I Do Not Have Any Social Media Accounts Says Tollywood Actor Rao Ramesh

సెలెబ్రిటీస్ కు సోషల్ మీడియా అకౌంట్స్ అప్పుడప్పుడు తలనొప్పిగా తయారవుతున్నాయి. కొంతమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుంటే కొంతమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల అనేకమంది ఇబ్బందులు పడ్డారు… పడుతూనే వున్నారు. రీసెంట్ గానే పూజా హెగ్డే ఇన్స్టా అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఇప్పటికే ఇదో రచ్చ లా తయారైంది. సమంత-పూజ హెగ్డే ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది. ఇప్పుడు ఈ ఫేక్ అకౌంట్స్ కు మరో నటుడు గురయ్యాడు. ఆయనెవరో కాదు రావు రమేష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రముఖ నటుడు రావు రమేష్ ట్వీట్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. `మొదటి విధ్వంసం! చాలా బాధపడ్డా.. మన ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుందో అని. ఇప్పటికైనా మారతారని ఆశిస్తూ – మీ రావు రమేష్` అంటూ ప్రజావేదిక కూల్చివేత గురించి రావు రమేష్ పేరు మీదుగా ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే దీనిపై రావు రమేష్ స్పందిస్తూ.. ఆయన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్టు తెలిపారు.

నాకు ఏ సోషల్ మీడియా లో ఏటువంటి అకౌంట్స్ లేవు, ఫేస్ బుక్ గానీ, ట్విట్టర్ గానీ , ఇన్ స్ట్రా గ్రామ్ ఇలా ఏమి లేవు..ఈ రోజు నా పేరు మీద ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు…ఆ పోస్టులు కు గానీ , ఆ అకౌంట్ కు గానీ నాకు ఏటువంటి సంబంధం లేదు..దయచేసి వాటిని నమ్మకండి.. ఏమైనా ఉంటే పత్రికా ముఖంగా నేనే తెలియజేస్తాను. నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టబోతున్నాన`ని రావు రమేష్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.