ఆవిధంగా హేటర్స్ నాకు మేలు చేస్తున్నారు..!

Compliments Make Me Lazy, But Insults Propel Me In That Way Haters Help Me To Give My Best Says Actress Samantha Akkineni
Compliments Make Me Lazy, But Insults Propel Me In That Way Haters Help Me To Give My Best Says Actress Samantha Akkineni

మొదటినుండి విభిన్నమైన కథలతో.. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కి టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా తను ఉంటే చాలు సినిమా హిట్టే అన్న పేరు తెచ్చుకొని అతి తక్కువ కాలంలోనే సార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. పెళ్ళైన తర్వాత కూడా సామ్ వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. పెళ్లి అనంతరం ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘అభిమన్యుడు’ ‘మజిలీ’ ‘సూపర్ డీలక్స్’ ‘ ఓ బేబీ’, ‘జాను’ లాంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది సమంత..ఇప్పుడు పలు తెలుగు, తమిళ్ సినిమాతో.. మరో వైపు వెబ్ సిరీస్ తో కెరీర్ లో దూసుకుపోతుంది.

ఇదిలా ఉండగా లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక సమంత కూడా ఇంట్లోనే ఉంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూనే. ఇక నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో ముచ్చటించిన సామ్ ను ఒక అభిమాని మిమ్మల్ని ద్వేషించే వారి పట్ల మీ అభిప్రాయం ఏమిటని అని అడిగితే సమంత చెప్పిన సమాధానంగా ద్వేషించే వారు మరియు విమర్శకులు ఇంకా బాగా నటించాలనే కసిని పెంచుతారు. పొగడ్తలు బద్ధకస్థురాలిగా మారుస్తాయి. కాబట్టి హేటర్స్ ఆవిధంగా తనకు మేలే చేస్తున్నట్లు సమంత చెప్పింది.

ప్రస్తుతం తమిళంలో ఆమె ఓ చిత్రం చేస్తుంది. అలాగే హిందీ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ 2 లో సమంత నటిస్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here