[POLL]ఈ స్టార్ హీరోస్‌లో భూమికా చావ్లాకి బెస్ట్ పెయిర్ ఎవరు?

Who Among These Star Heroes Can Make The Best Pair With Actress Bhoomika Chawla?

భూమికా చావ్లా.. నవతరం ‘మిస్సమ్మ’. అందం, అభినయం, అదృష్టం.. ఈ మూడు అంశాల మేళవింపు భూమిక. అనతికాలంలోనే అగ్ర కథానాయిక అనిపించుకున్న భూమిక.. తెలుగునాట దాదాపు అందరి స్టార్ హీరోస్ తోనూ సందడి చేసింది. మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ యన్టీఆర్ సరసన ‘లక్కీ హీరోయిన్’ గా పేరు తెచ్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన ఏడవ చిత్రం ‘ఖుషి’, మహేష్ హీరోగా నటించిన ఏడో సినిమా ‘ఒక్కడు’, తారక్ కథానాయకుడిగా నటించిన సెవెన్త్‌ మూవీ ‘సింహాద్రి’లోనూ భూమికనే నాయిక కావడం విశేషం. ఈ మూడు ‘సెవెన్త్‌ వండ‌ర్స్’ లోనూ ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటించి మెప్పించింది భూమిక. అలాగే, ‘మెగాస్టార్’ చిరంజీవి(‘జై చిరంజీవ’), ‘కింగ్’ నాగార్జున(‘స్నేహమంటే ఇదేరా’), ‘విక్టరీ’ వెంకటేష్(‘వాసు’) వంటి నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయ‌కుల‌తోనూ ఆడిపాడింది. మొత్తంగా రెండు తరాల అగ్ర కథానాయకులతో కలసి నటించి ‘స్టార్ హీరోయిన్’ అనిపించుకుంది.

ఇదిలా ఉంటే.. భూమిక క‌థానాయిక‌గా న‌టించిన తొలి చిత్రం ‘యువకుడు’ విడుదలై 20 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ‘ది తెలుగు ఫిలిమ్ నగర్.కామ్’ ఓ ఆసక్తికరమైన పోల్ గేమ్‌ను నిర్వహిస్తుంది. ఈ ఆరుగురి కథానాయకుల్లో భూమికకి బెస్ట్ పెయిర్ ఎవరన్నదే ఈ పోల్ గేమ్ థీమ్. మీ అభిప్రాయాన్ని మీ ఓటు ద్వారా తెలియజేసే ప్రయత్నమిది. మరెందుకు ఆలస్యం.. పోల్ గేమ్‌లోకి ఎంటర్ అవుదాం.

[totalpoll id=”43269″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.