కృష్ణ ‘పెళ్లికూతురు’కు 50 ఏళ్ళు

Super Star Krishna's Pelli Kuthuru Completes 50 Years

సూపర్ స్టార్ కృష్ణకు బాగా కలిసొచ్చిన దర్శకుల్లో వి.రామచంద్రరావు ఒకరు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెర‌కెక్కిన పలు చిత్రాలు విజయం సాధించాయి. వాటిలో ‘పెళ్లికూతురు’ ఒకటి. కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ సినిమాలో.. కృష్ణంరాజు, రాజశ్రీ, ‘షావుకారు’ జానకి, నాగభూషణం, చంద్రమోహన్, రేలంగి, అల్లు రామలింగయ్య, రాజబాబు ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆరుద్ర, దాశరధి, కొసరాజు, డా.సి.నారాయణ రెడ్డి గీత రచన చేయగా.. ఎస్.పి.కోదండపాణి స్వరాలు సమకూర్చారు. “రాముని రూపమే మోహనము”, “వెర్రి మొర్రి వెంగళప్ప పుట్టినరోజంట”, “ఆలకించవా నా మొర మురళీధర”, “చక్కని పిల్ల పక్కనవుంది”, “మేలిమి బంగారు”.. వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. సుంద‌ర్‌లాల్ నహ‌తా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై పి.బాబ్జీ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1970 ఏప్రిల్ 17న విడుదలైన ‘పెళ్లికూతురు’.. నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − eighteen =