“తుపాకి 2” మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Once Again Teams Up With Vijay In Thuppakki 2

అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కాజల్ అగర్వాల్ టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “, విష్ణు మంచు హీరోగా రూపొందుతున్న “మోసగాళ్ళు” మూవీస్ లో నటిస్తున్నారు. కాజల్ ఇప్పుడు ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై మురుగ దాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ హీరోగా “తుపాకి 2” మూవీ రూపొందనుంది. విజయ్ ఆర్మీ ఆఫీసర్ గా నటించిన “తుపాకి” మూవీ కి సీక్వెల్ గా రూపొందనున్న “తుపాకి 2” మూవీ లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ఎంపిక అయ్యారు. విజయ్, కాజల్ జంటగా రూపొందిన “తుపాకి “, “జిల్లా “, “మెర్సల్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. దర్శకుడు మురుగ దాస్, హీరో విజయ్ కాంబినేషన్ లో రూపొందిన “తుపాకి”, “కత్తి “, సర్కార్ మూవీస్ ఘన విజయం సాధించాయి. విజయ్, కాజల్ కాంబినేషన్ లో 4వ మూవీ, మురుగ దాస్, విజయ్ కాంబినేషన్ లో 4వ మూవీ “తుపాకి 2 ” కావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.