త్వరలో సెట్స్ పైకి ‘ఎఫ్3’..!

Blockbuster Movie F2 Sequel To Hit The Floors Soon

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ‘ఎఫ్2’. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిండో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. అంతేకాదు రూ.120 కోట్ల గ్రాస్,రూ.80 షేర్‌ను రాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా వెంకీ,వరుణ్ ఆఖరికి దిల్ రాజు కెరీర్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు అనిల్ రావిపూడి, దిల్ రాజు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం..త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఆ స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా వున్నాడు. అయితే ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాలని అనిల్ రావిపూడితో ‘దిల్’ రాజు చెప్పాడట. ఆ దిశగా తన పనులను అనిల్ రావిపూడి వేగవంతం చేసినట్టుగా చెబుతున్నారు. ఇక ఈ సీక్వెల్ లో హీరోలుగా మొదటగా పలువురు పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా మళ్ళీ వెంకటేశ్ – వరుణ్ తేజ్ లే ఈ సీక్వెల్ లో ఖరారైనట్టు సమాచారం. హీరోయిన్ల విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. మొత్తానికి వచ్చేఏడాది సంక్రాంతికి ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నట్టున్నాడు దిల్ రాజు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =