`ఆరెంజ్`.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన సినిమా ఇది. మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. కమర్షియల్ గా మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. కట్ చేస్తే.. దాదాపు పదేళ్ళ తరువాత చరణ్ మరో ప్రేమకథా చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఆ వివరాల్లోకి వెళితే.. `మళ్ళీ రావా`, `జెర్సీ` చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. చరణ్ కోసం ఓ ప్రేమకథను సిద్ధం చేశాడట. పంజాబీ అమ్మాయితో ప్రేమలో పడే ఓ తెలుగు కుర్రాడి కథగా ఈ సినిమా ఉంటుందట. అంతేకాదు.. చరణ్ ఏజ్, క్రేజ్, ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ స్టోరీని సిద్ధం చేశాడట గౌతమ్. `ఆర్ ఆర్ ఆర్` రిలీజయ్యాక చరణ్ చేయబోయే సినిమాల్లో.. గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ మూవీ కూడా ఉంటుందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో.. ఇప్పుడీ వార్త మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి.. `ఆరెంజ్`తో కమర్షియల్ హిట్ అందుకోలేకపోయిన చరణ్.. ఈ ప్రేమకథా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: