వేస‌విలో ప్రారంభం కానున్న‌ `వెంక‌టేష్ 75`?

Venkatesh Daggubati 75 To Hit Floors In Summer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Venkatesh,Venkatesh Daggubati,Venkatesh Daggubati Latest News,Venkatesh Daggubati New Movie News,Venkatesh Daggubati Next Film Updates,Venkatesh Daggubati New Project Details

త‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా రిలీజైన `వెంకిమామ‌`తో క‌థానాయ‌కుడిగా 73 చిత్రాల‌ను పూర్తిచేసుకున్నారు సీనియ‌ర్ హీరో వెంక‌టేష్. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న `నార‌ప్ప‌`.. వెంకీ 74వ సినిమాగా తెర‌కెక్కుతోంది. వేస‌విలో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ‌య్యేలోపే త‌న 75వ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నార‌ట వెంకీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. `పెళ్ళి చూపులు` ఫేమ్ త‌రుణ్ భాస్క‌ర్ డైరెక్ష‌న్ లో వెంక‌టేష్ ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు చాన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. హార్స్ రేసింగ్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని `నార‌ప్ప‌` తాలూకు త‌న షూటింగ్ పార్ట్ పూర్త‌వ‌గానే ప‌ట్టాలెక్కించ‌నున్నార‌ట వెంకీ. ప్ర‌స్తుతం త‌రుణ్.. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తిచేసే ప‌నిలో ఉన్నాడు. కాగా, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించ‌నుంది. త్వ‌ర‌లోనే వెంకీ, త‌రుణ్ కాంబో మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − one =