రాహుల్ సిప్లిగంజ్ పై పబ్ లో దాడి

Singer Rahul Sipligunj Was Injured In An Attack At A Pub In Gachibowli

సింగర్, బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై నిన్న (4వ తేదీ ) రాత్రి ఒక పబ్ లో కొంతమంది యువకులు దాడి చేసి గాయపరిచారు. రాహుల్ తన స్నేహితురాలితో గచ్చిబౌలి లోని ఒక పబ్ కు వెళ్ళారు. పబ్ లో రాహుల్ స్నేహితురాలితో కొంతమంది యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో రాహుల్, యువకుల మధ్య గొడవ జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పబ్ లో జరిగిన గొడవ లో ఆ యువకులు బీర్ బాటిల్స్ తో రాహుల్ ను గాయపరిచారని , రాహుల్ తలకు తీవ్ర గాయాలయ్యానని సమాచారం. చికిత్స నిమిత్తం రాహుల్ ను పబ్ యాజమాన్యం గచ్చిబౌలి లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారని, రాహుల్ కోలుకుంటున్నారని సమాచారం. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న “రంగమార్తాండ ” మూవీ లో రాహుల్ నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + five =