‘పలాస 1978’ డైరెక్టర్ కు అల్లు అరవింద్ బంపరాఫర్

Tollywood Ace Producer Allu Aravind Surprises Palasa 1978 Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Allu Aravind,Palasa 1978 Director,Tollywood Ace Producer Allu Aravind,Allu Aravind Latest News,Producer Allu Aravind Surprises Palasa 1978 Director

కొత్త దర్శకుడికి అల్లు అరవింద్ బంపరాఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ కొత్త డైరెక్టర్ ఎవరు..? ఆ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా? అసలు సంగతేంటంటే…1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతూ వస్తున్న సినిమా ‘పలాస 1978’. ఇక ఈ సినిమా రేపు (మార్చి6) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇండస్ట్రీలోని పలువురికి ప్రివ్యూ వేశారు చిత్రయూనిట్. ఇక ప్రివ్యూ చూసిన అల్లు అరవింద్ కు సినిమా బాగా నచ్చిందంట. కరుణ కుమార్ పనితనం బాగా ఆకట్టుకుందని ఆయన ప్రశంసించారు. అంతే కాదు ఈ కొత్త దర్శకుడికి ఆఫర్ కూడా ఇచ్చాడు. తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలని ఆఫర్ ఇచ్చారు. అంతేనా.. కరుణ కుమార్ కు అడ్వాన్స్ చెక్ కూడా అందించారు. మొత్తానికి కరుణ కుమార్ బాగానే ఇంప్రెస్ చేసినట్టున్నాడు అల్లు అరవింద్ ని. లేకపోతే ఎంతో ఆలోచించి కానీ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అల్లు అరవింద్… అవేమి లేకుండా ఇలా ముందే అడ్వాన్స్ కూడా ఇచ్చాడంటే మ్యాటరున్నట్టే. ఇక ఈ కొత్త సినిమాకు సంబంధించి మిగిలిన వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ను రెలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు అందరిలో మరింతగా ఆసక్తి పెరిగిపోయింది.మరి రిలీజ్ అవ్వకముందే హిట్ టాక్ తెచ్చేసుకున్న ఈ సినిమా.. రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =