పెళ్ళైన తర్వాత సమంత తన రూట్ మార్చేసింది. కేవలం పాత్ర ప్రధానమైన… లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తుంది. అంతేకాదు పెళ్ళైన తర్వాత వరుసగా హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో ఇప్పటికే విజయ్ సేతుపతితో కలిసి సమంత సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. దీనితోపాటు తాజాగా మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి కూడా తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాయ, గేమ్ ఓవర్ చిత్రాల దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో సినిమా వస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ చిత్రం పూర్తిగా హర్రర్ జానర్లో ఉంటుందని తెలుస్తోంది. తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు.




ఇక అశ్విన్ గతంలో చేసిన రెండు సినిమాలు హర్రర్ సినిమాలే. సమంత ‘రాజుగారి గది 2’ హారర్ థ్రిల్లర్ చిత్రంలో నటించింది. మరి ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను అశ్విన్ ఎంత భయంకరంగా తెరకెక్కిస్తాడు…సమంతను ఎలా చూపిస్తాడు అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























