విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో… ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్, ఇటీవలే మొదటి పాట .. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























