ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో..?

Crazy Actor Director Combinations,Tollywood Actor Director Combinations,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Actor Director Combinations on Screens,Telugu Actor Director Combinations,Most Influential Actor Director Combos

కొన్ని కాంబినేషన్స్ లో సినిమా వస్తే ఎన్ని సార్లు అయినా చూడాలనిపిస్తుంది. టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్స్ చాలానే చూశాం. కొన్ని కాంబినేషన్స్ మాత్రం రిపీట్ అవుతూనే ఉంటాయి. ఉదాహరణకు.. పూరీ జగన్నాధ్ – మహేష్ బాబు, అల్లు అర్జున్ అయితే ఏకంగా త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేయగా.. సుకుమార్ తో మూడో సినిమా చేస్తున్నాడు. నాని ఇంద్రగంటి ఇలా ఒక్క కాంబినేషన్ చాలా సార్లే రిపీట్ అయింది. కానీ కొన్ని కాంబినేషన్ లో మాత్రం సినిమాలు ఇప్పటి వరకూ వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు వస్తే ఎలా ఉంటుందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవన్ కళ్యాణ్ – రాజమౌళి

పవన్ కళ్యాణ్-రాజమౌళి కాంబినేషన్ లో అసలు సినిమా వస్తుందో?లేదో?తెలియదు కానీ ఆ ఊహ మాత్రం చాలా బావుంది కదా. పవన్ ఇప్పటివరకూ మ్యాగ్జిమమ్ లవ్ స్టోరీ లు, కమర్షియల్ స్టోరీ లు మాత్రమే చేసాడు. గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ ఇటీవలే మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ చేస్తున్నాడు  పవన్. అయితే ఒకవేళ కనుక పవన్-రాజమౌళి సినిమా వస్తే ఎలా ఉంటుందో. ఈ జోనర్ లో పవన్ ను రాజమౌళి చూపిస్తాడో.. ఒక ఛత్రపతి, విక్రమార్కుడు లాంటి సినిమా తరహాలో సినిమా వస్తే ఎలా ఉంటుందో..

మహేష్ బాబు – గౌతమ్ మీనన్

నిజానికి టాలీవుడ్ లో వున్న హీరోల్లో ఎక్కువ ప్రయోగాలు చేసిన హీరో ఎవరైనా వున్నారంటే మహేష్ బాబు అని చెప్పొచ్చు. ఇక మహేష్ బాబును కూడా డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో చూశాం కానీ ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ లో మాత్రం చూడలేదు. ఇక మహేష్ బాబు గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో పూర్తి లవ్ స్టోరీ నేపథ్యంలో సినిమా వస్తే ఎలా ఉంటుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏం మాయ చేసావే’, ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాలు చూసే వుంటారు. ఆ సినిమా ఎంత స్లో గా.. నీట్ గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్యూర్ లవ్ స్టోరీ నే ఉంటుంది. అలాంటి ఒక సినిమాను మహేష్ తో గౌతమ్ మీనన్ చేస్తే ఎలా ఉంటుందో..

ప్రభాస్ – బోయపాటి శ్రీను

కొన్ని కాంబినేషన్స్ వినడానికే వెరైటీగా అనిపిస్తాయి అందులో ప్రభాస్-బోయపాటి కాంబినేషన్ కూడా ఒకటి.బహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం రాధాకృష్ణ సినిమాతో బిజీగా వున్నాడు. ఇక బోయపాటి సినిమాలంటే ఫుల్ యాక్షన్ సినిమాలు అని తెలిసిందే. ప్రభాస్ కూడా ఛత్రపతి లాంటి సినిమా చేసాడనుకోండి. అయితే బోయపాటి స్టయిల్ లో అంటే ఒక సింహా, లెజెండ్ తరహాలో సినిమా వస్తే.. ఆ కిక్కే వేరప్ప అన్నట్టు లేదు. మరి ఈ కాంబినేషన్ అసలు వచ్చే ఛాన్స్ ఉందో?లేదో? చూద్దాం.

ఎన్టీఆర్ – శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లు చేయడంలో ఎక్స్పర్ట్. ఇక ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్రలోనే ఇట్టే దూరిపోయి నటించేస్తాడు. అలాంటి ఎన్టీఆర్ తో శేఖర్ కమ్ముల ఒక ఆనంద్, ఫిదా లాంటి సినిమాను తీస్తే ఎలా ఉంటుందో చూడాలి. సైలెంట్ గా ఎలాంటి కమర్షిల్ హంగులు లేకుండా ఎన్టీఆర్ ను కూడా ఆ యాంగిల్ లో చూడాలంటే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

[custom_ad]

అల్లు అర్జున్ – కృష్ణవంశీ

లాంగ్ గ్యాప్ తర్వాత ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ ఇప్పటి వరకు మ్యాగ్జిమమ్ ఫుల్ కమర్షియల్ సినిమాలే చేసాడు తప్ప ఒక్క పక్కా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి సినిమా లేదనే చెప్పొచ్చు. మరి ఆ హడావిడి మొత్తం కృష్ణవంశీ సినిమాల్లోనే కనిపిస్తుంది. ఒక మురారి, చందమామ సినిమా లాంటి సినిమా అల్లు అర్జున్ తో కృష్ణ వంశీ తీస్తే ఆ హడావుడి వేరే రేంజ్ లో ఉంటుందేమో..

రామ్ చరణ్ – కొరటాల శివ

సందేశాత్మక కథలను కమర్షియలైజ్ చేసి తెరకెక్కించడంలో కొరటాల శివ దిట్ట. ఇక జోనర్ లో రామ్ చరణ్ ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదని చెప్పొచ్చు. లవ్, సోషియో ఫాంటసి, కమర్షియల్ సినిమాల్లో నటించాడు చరణ్. ఇలా సందేశాత్మక సినిమా ఇప్పటి వరకూ చేయలేదు. ఒక శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమా చరణ్ తో ఎప్పుడు చేస్తాడో శివ. ప్రస్తుతం మరి చిరు తో సినిమా చేస్తున్నాడు.. కొడుకు రాంచరణ్ తో ఎప్పుడు సినిమా చేస్తాడో చూడాలి.

నాని – పూరి జగన్నాధ్

కొంత మంది హీరోయిన్స్ ను చూసి మన పక్కింటి అమ్మాయి లాగానే ఉంటుంది అని ఎలాగైతే అంటామో.. హీరోల్లో నానిని చూసిన అలానే అనిపిస్తుంది. తను కూడా ఏదో నటిస్తున్నాడు అన్నట్టు కాకుండా న్యాచురల్ గా నటిస్తాడు కాబట్టే న్యాచురల్ స్టార్ అయ్యాడు. మరి నాని సినిమాల విషయానికొస్తే కాస్త కామెడీ, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్, లవ్ యాంగిల్ ఇవి కామన్. మరి ఇదే నాని డాషింగ్ డైరెక్టర్ పూరీ తో సినిమా చేస్తే..! ఒక పోకిరి, ఇడియట్ లాంటి తరహాలో నాని సినిమా చేస్తే..!

పైన చెప్పినవన్నీ క్రేజీ కాంబినేషన్సే. ఇంకా కొన్ని కాంబినేషన్స్ లో కూడా సినిమాలు రాలేదు. మరి ఈ కాంబినేషన్స్ ఫ్యూచర్ లో కలిసి పని చేసే అవకాశం వస్తుందో లేదో..? చూడాలి మరి..

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =