కుటుంబ కథా చిత్రాలకు చిరునామాగా నిలచిన కథానాయకుల్లో `విక్టరీ` వెంకటేష్ ఒకరు. ఆయన నటించిన పలు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో `సంక్రాంతి` ఒకటి. తమిళ చిత్రం ‘ఆనందం’(2001)కి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ సరసన స్నేహ, ఆర్తి అగర్వాల్ నాయికలుగా నటించారు. శ్రీకాంత్, శివబాలాజి, శర్వానంద్, చంద్రమోహన్, శారద, సంగీత, రతి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. `రాజా` వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత వెంకటేష్, ముప్పలనేని శివ కాంబినేషన్లో వచ్చిన `సంక్రాంతి` కూడా అదే బాట పట్టడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇక ఎస్.ఎ.రాజ్‌కుమార్ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. “అందాల శ్రీమతికి”, “ఎలా వచ్చెనమ్మా”, “ఆడే పాడే వయసుకు”, “ఆశ ఆశగా అడిగింది”, “చిలకా చందనపట్టు”, “డోలి డోలి డోలిరే” వంటి గీతాలు అలరించాయి. 2005 ఫిబ్రవరి 18న విడుదలైన ‘సంక్రాంతి’… నేటితో 15 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: