21 వ తేదీ రిలీజ్ కానున్న 6 చిత్రాలు

These 6 Telugu Movies To Release On 21st February 2020

ఫిబ్రవరి 21 వ తేదీ శివరాత్రి సందర్భంగా 6 సినిమాలు రిలీజ్ కానున్నాయి. డిఫరెంట్ జానర్ లలో రూపొందిన ఈ 6 చిత్రాలలో ఒకటి తమిళ డబ్బింగ్ మూవీ. ఈ సినిమాలలో ఏ ఏ సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతాయో వేచిచూడాల్సిందే. ఇప్పుడు ఆ చిత్ర విశేషాలను తెలుసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1. వలయం : చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మాతగా రమేష్ కడుముల దర్శకత్వంలో లక్ష్ చదలవాడ , దిగాంగన జంటగా రూపొందిన థ్రిల్లర్ మూవీ “వలయం”. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ మూవీ పై అంచనాలను పెంచాయి.

2. ప్రెషర్ కుక్కర్ : అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై సుజోయ్ &సునీల్ దర్శకత్వంలో సాయి రోనిక్, ప్రీతి అస్రానీ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో ప్రతి ఇంట ఇదే లొల్లి ట్యాగ్ లైన్ తో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “ప్రెషర్ కుక్కర్” మూవీ శివరాత్రి కి రిలీజ్ కానుంది. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంది.

3. భీష్మ :సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “భీష్మ” మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలతో శివరాత్రి కానుకగా రిలీజ్ కానుంది.

4 . చీమ ప్రేమ మధ్యలో భామ : మేగ్నమ్ ఆపస్ ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అప్పలరాజు దర్శకత్వంలో అమిత్, ఇందు జంటగా రూపొందిన ఫాంటసీ మూవీ ” చీమ ప్రేమ మధ్యలో భామ” గ్రాఫిక్స్, మ్యూజిక్ హై లైట్ గా 21 వ తేదీ రిలీజ్ కానుంది.

5. శివలింగాపురం : అపోలో ప్రొడక్షన్స్ బ్యానర్ పై తోట కృష్ణ దర్శకత్వంలో ఆర్ కె సురేష్,మధుబాల జంటగా రూపొందిన  “శివలింగాపురం” మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

6. వసంతకాలం :5 కలర్స్ మీడియా బ్యానర్ పై చక్రి తోలేటి దర్శకత్వంలో నయనతార, భూమిక ప్రధాన పాత్రలలో రూపొందిన హారర్ మూవీ “వసంత కాలం” 21 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ మూవీ “కొలయుత్తిర్ కాలం” కు తెలుగు డబ్బింగ్ వెర్షన్ “వసంత కాలం” మూవీ .

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 12 =