బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన కన్నడ బ్యూటీ రష్మిక “గీత గోవిందం” మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ మూవీస్ లో అవకాశాలు అందుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో జంటగా నటించిన “సరిలేరు నీకెవ్వరు ” సంక్రాంతికి రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. రష్మిక ప్రస్తుతం
సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న #AA 20 మూవీ, తమిళ భాషలో కార్తీహీరోగారూపొందుతున్న”సుల్తాన్” మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “భీష్మ” మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. “భీష్మ ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన సమావేశంలో ఎవరి పై క్రష్ ఉందనే ప్రశ్నకు రష్మిక తమిళ సూపర్ స్టార్ విజయ్ పై క్రష్ ఉందని జవాబిచ్చారు. చిన్న తనం నుంచీ విజయ్ పై క్రష్ ఉందని, ఆయనతో నటించడానికి ఆసక్తి
ఉందని తెలిపారు. కోలీవుడ్ లో పరిచయం అవుతున్న “సుల్తాన్ ” మూవీ రిలీజ్ కాకుండానే అక్కడ రష్మిక కు అభిమానులు ఏర్పడటం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: