ప్రముఖ కన్నడ నటి కిషోరి బల్లాల్ మృతి

గత మూడు నాలుగు రోజుల నుండి సినీ పరిశ్రమకు చెందిన ఎవరో ఒకరు మరణించడం చూస్తున్నాం. గత రెండు రోజుల క్రితం చిరంజీవి ఫస్ట్ మూవీ పునాదిరాళ్లు మూవీ డైరెక్టర్ గుడిపాటి రాజ్ కుమార్ మృతి చెందగా.. నిన్న శ్రీకాంత్ తండ్రి తుది శ్వాస విడిచారు. ఈ రోజు డైరెక్టర్ వీర శంకర్ తండ్రి చనిపోగా.. తాజాగా ఇప్పుడు మరో వెటరన్ నటి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సీనియర్ కన్నడ నటి కిషోరి బల్లాల్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో బాధపడుతూ ఆమె ఈ రోజు మరణించారు. ఇక ఆమె మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు.. ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా 1960 లో ఎవలేంత హేండ్తి అనే కన్నడ సినిమాతో సినీ పరిశ్రకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. హిందీలో షారుఖ్ ఖాన్ స్వదేశ్ సినిమాలో షారుఖ్ కు తల్లి గా కూడా నటించారు. ఇక తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు కిషోరి బల్లాల్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.