దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఝమ్మంది నాదం’ మూవీతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది తాప్సీ. ఆ తర్వాత పలు గ్లామర్ పాత్రల్లో నటించిన ఆమె ఇప్పుడు కేవలం నటనకు ప్రాధాన్యమైన పాత్రల్లోనే నటిస్తుంది. బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఆమె గ్రాఫే మారిపోయింది. అక్కడ వరుస హిట్ లతో దూసుకుపోతుంది. పింక్, బద్లా, సాండ్ కీ ఆంఖ్, ఇటీవల వచ్చిన ‘ముల్క్’ ఇలా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ బిజీ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాదు `సాండ్ కీ ఆంఖ్` చిత్రానికి గానూ ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా అవార్డుని దక్కించుకుంది తాప్సీ. ఇక తాను నటించిన ‘థప్పడ్’ ఈ నెలాఖరున విడుదల అవుతుండగా.. మిథాలీ రాజ్ బయోపిక్ ‘శభాష్ మిథూ’ లో నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Im greedy for good scripts,here’s one more,Sony Pictures India & Ellipsis Entertainment’s”LOOOP LAPETA” thriller-comedy with @TahirRajBhasin adaptation of “Run Lola Run” @sonypicsindia @EllipsisEntt @tanuj_garg @atulkasbekar @vivekkrishnani @Aayush_BLM #aakashbhatia #LooopLapeta pic.twitter.com/9c78sPXkmq
— taapsee pannu (@taapsee) February 18, 2020
[custom_ad]
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రకటించింది. మరో జర్మన్ మూవీ ని రీమేక్ చేస్తున్నట్టు తెలిపింది. గతంలో స్పానిష్ మూవీ ‘ఇన్విజిబుల్ గెస్ట్’ అనే సినిమాను బద్లా పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 1998 లో వచ్చిన జర్మన్ హిట్ ఫిల్మ్ `రన్ లోలా రన్` సినిమాను రీమేక్ చేయనున్నారు. అంతే ఈ సినిమాక `లూప్ లొపేటా` అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఆకాష్ భాటియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో తాప్సీ తో పాటు తాహిర్ రాజ్ భాసిన్ మరో లీడ్ రోల్ లో నటించనున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 29 రిలీజ్ చేయనున్నట్టు కూడా ముందే తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: