కలిసి రాని సీక్వెల్స్ – ఈ సీక్వెల్స్ పరిస్థితి ఏంటో..!

A Quick Rundown On Popular Telugu Movies And Their Sequels

ఒక సినిమా హిట్టయిందంటే చాలు ఆ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడమో.. లేక సీక్వెల్స్ చేయడమో చేస్తుంటారు. ఇది సినీ పరిశ్రమలో ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయమే. అయితే గత కొంత కాలంగా సీక్వెల్స్ కు కొంత బ్రేక్ పడినా.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో సీక్వెల్స్‌ సందడి మొదలైంది. స్టార్‌ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సీక్వెల్స్‌ పనిలో పడ్డారు. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ థింగ్ వుంది. గతంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకు సీక్వెల్స్ చేయగా అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత డిజాస్టర్ లను సొంతం చేసుకున్నాయో కూడా చూశాం. శంకర్ దాదా ఎం.బి.బి.యస్ సినిమా సీక్వెల్ శంకర్ దాదా జిందాబాద్ నుండి.. చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి, కిక్ సీక్వెల్ కిక్ 2, గబ్బర్ సింగ్ సీక్వెల్ సర్దార్ గబ్బర్ కింగ్, మన్మథుడు సీక్వెల్స్ మన్మథుడు2 ను తీయగా ఈ సీక్వెల్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. అయితే అవేమి పట్టించుకోకుండా కొన్ని సినిమాలు ఇప్పుడు సీక్వెల్ గా వస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న సీక్వెల్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారతీయుడు 2

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.

కె.జి.ఎఫ్ 2

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్లు వ‌సూలు చేసి రికార్డులు సృష్టించ‌గా, క‌న్న‌డ‌లో 100 కోట్లు వ‌సూలు చేసింది. నిజానికి కన్నడం 100కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కె.జి.ఎఫ్ 2 తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది జులై లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఎఫ్ 3

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ ఎఫ్ 2 ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతికి బరిలో దిగిన ఈ సినిమా పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి విన్నర్ గా నిలిచింది. అటు వెంకీ కి కానీ.. ఇటు వరుణ్ కు కానీ.. ప్రొడ్యూసర్ దిల్ రాజు కు అందరికీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఈసినిమా సీక్వెల్ కూడా ఉంటుందని ఎప్పుడో చెప్పేశారు. ఎఫ్ 3 పేరుతో రూపొందించబోయే ఈ సీక్వెల్ లో స్టార్ హీరోలే నటించనున్నారు.

కార్తికేయ 2

నిఖిల్, కలర్స్ స్వాతి హీరో హీరోయిన్లుగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ను కూడా తెరకెక్కించనున్నారు. గత ఏడాదే ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు.. కానీ ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ మీద నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే వున్నాయి. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

[custom_ad]

గూఢచారి2

అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో అడవి శేష్, శోభిత జంటగా నటించిన గూఢచారి సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సినిమాకు కూడా సీక్వెల్ చేయనున్నాడు అడివి శేష్. ప్రస్తుతం మేజర్ సినిమాతో బిజీ గా ఉన్న శేష్ ఈ సినిమా అయిపోయిన తర్వాత గూఢచారి సీక్వెల్ ను లైన్ లో పెట్టనున్నాడు.

డబుల్ ఇస్మార్ట్

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి ) నిర్మాణ సారథ్యంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాకు కూడా సీక్వెల్ ఉంటుందని గతంలోనే చెప్పారు. ఇప్పటీకే డబుల్ ఇస్మార్ట్ టైటిల్ ను
కూడా రిజిస్టర్ చేశారు. మరి ఇది ఎంత వరకూ పట్టాలెక్కుతుందో చూడాలి.

బంగార్రాజు

ఇంకా 2016 లో నాగ్‌ ద్విపాత్రాభినయం తో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ సంక్రాంతికి వచ్చి అదరగొట్టేశారు. ఐతే ఇందులోని ‘బంగార్రాజు’ పాత్ర పేరుతోనే ఓ సినిమా రూపొందిస్తామని ఆ చిత్ర దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ ఎప్పుడో ప్రకటించేశారు. నాగార్జున దీనికి ఓకే కూడా చెప్పేశాడు. అయితే అది వార్తల్లోనే నిలిచింది తప్ప ఇంతవరకూ పట్టాలెక్కలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ సీక్వెల్ తెరపైకి వచ్చింది. ఉగాది రోజున బంగార్రాజు చిత్రాన్ని మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో నాగచైతన్య కూడా నటించే అవకాశాలున్నట్టు సమాచారం. 2020 సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది….

మరి ఈ సీక్వెల్ లో ఏ సీక్వెల్ హిస్టరీ రిపీట్ చేస్తుందో చూడాలంటే మాత్రం ఈ సినిమాలు వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 2 =