అల్లు అర్జున్ తో మ‌రోసారి సురేంద‌ర్ రెడ్డి?

race-gurram-blockbuster-combo-repeats-once-again

`రేసు గుర్రం`… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రం. `కిక్` త‌రువాత కాస్త ట్రాక్ త‌ప్పిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి.. ఈ సినిమాతోనే మ‌ళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. బ‌న్నీ, సూరి ఫ‌స్ట్ కాంబోలో వ‌చ్చిన ఈ చిత్రం… 2014 వేస‌విలో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. క‌ట్ చేస్తే.. ఆరేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతోంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

`రేసు గుర్రం`లాగే ఈ సినిమా కూడా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా సాగుతుంద‌ని వినికిడి. అలాగే, ఏడాది చివ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారట‌. ప్ర‌స్తుతం బ‌న్నీ.. సుకుమార్ కాంబినేష‌న్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆ త‌రువాత వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఐకాన్` చేయ‌నున్నాడు. ఆ త‌రువాతే సురేంద‌ర్ రెడ్డి సినిమా సెట్స్ పైకి వెళుతుంద‌ని టాక్. మ‌రి.. `రేసు గుర్రం` కాంబో మ‌రోసారి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంటుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =