మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్?

Merlapaka Gandhi To Direct Nithiin

`వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్` (2013)తో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేశాడు మేర్ల‌పాక గాంధీ. ఆ త‌రువాత `ఎక్స్ ప్రెస్ రాజా` అంటూ మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే, భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన అత‌ని మూడో చిత్రం `కృష్ణార్జున యుద్ధం` ఆశించిన విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో.. రెండేళ్ళ విరామం అనంత‌రం త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ట మేర్ల‌పాక గాంధీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా, తొలి మూడు చిత్రాల‌ను స్ట్ర‌యిట్ పిక్చ‌ర్స్ గా తెర‌కెక్కించిన గాంధీ… త‌దుప‌రి సినిమాని మాత్రం రీమేక్ గా రూపొందించ‌నున్నాడ‌ట‌. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అంధాధూన్` ఆధారంగా రూపొంద‌నున్న ఈ రీమేక్ లో నితిన్ హీరోగా న‌టించ‌నున్నాడు. `ఠాగూర్` మ‌ధు, సుధాక‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే నితిన్, మేర్ల‌పాక గాంధీ కాంబో మూవీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.