ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఫ్లాప్స్ తర్వాత ‘చిత్రలహరి’ సినిమాతో ఫైనల్ గా తన హిట్ ఖాతాను తెరిచాడు మెగా హీరో సాయి తేజ్. ఇక రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో హిట్ పై కన్నేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే వున్నారు చిత్రయూనిట్. ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి థీమ్ సాంగ్ ను విడుదల చేశారు.
[custom_ad]
కాగా `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. బ్యాచిలర్ లైఫే బెటర్ అంటూ డిఫరెంట్ స్టోరీ తో వస్తున్న ఈ సినిమా సాయి తేజ్ కు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: