షైన్ క్రియేషన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడి గా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్” మూవీ జనవరి లో పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రూపొందిన “నిన్నుకోరి” మూవీ ఘనవిజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]



సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న “టక్ జగదీష్” మూవీ షూటింగ్ నిన్న (11 వ తేదీ) పొల్లాచ్చి లో ప్రారంభం అయింది. దర్శకుడు శివ హీరో నాని, రీతూ వర్మల పై ప్రేమ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. హీరో నాని 25 వ మూవీ గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. “టక్ జగదీష్” మూవీ తరువాత హిట్ మూవీ “టాక్సీ వాలా” ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూపర్ హిట్ మూవీస్” నిన్నుకోరి”, “మజిలీ” తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న”టక్ జగదీష్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























