య‌న్టీఆర్ ‘లక్ష్మీకటాక్షం’కు 50 ఏళ్ళు

NTR Lakshmi Kataksham Completes 50 Years

మహానటుడు స్వర్గీయ యన్.టి.రామారావు, జానపద బ్రహ్మ బి.విఠలాచార్యది స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్. వీరి కలయికలో పలు జానపద చిత్రాలు తెరకెక్కగా వాటిలో సింహభాగం విజయం సాధించడం విశేషం. అటువంటి సినిమాలలో ‘లక్ష్మీకటాక్షం’ ఒకటి. జానపద చిత్రాల గాధలను కొత్త పుంతలు తొక్కించి, సరికొత్త వినోదాల జల్లును కురిపించిన ఈ చిత్రంలో… యన్టీఆర్ సరసన కె.ఆర్.విజయ, రాజశ్రీ కథానాయికలుగా నటించారు. సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, ఎం.బాలయ్య, మిక్కిలినేని, బాలకృష్ణ, హేమలత, జ్యోతిలక్ష్మి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

డా.సి.నారాయణరెడ్డి, కొసరాజు, చిల్లర భావనారాయణ, విశ్వప్రసాద్ గీత ర‌చ‌న చేయ‌గా.. దిగ్గజ స్వరచక్రవర్తి ఎస్.పి.కోదందపాణి బాణీలు సమకూర్చారు. వాటిలో “రా వెన్నెల దొర”, “అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో తెలిసిందిలే”, “కిలకల బుల్లెమ్మో” వంటి పాట‌లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. పి.ఎస్.ఆర్.పిక్చర్స్ పతాకంపై ప్ర‌ముఖ నిర్మాత పింజల సుబ్బారావు నిర్మించిన ‘లక్ష్మీకటాక్షం’ 1970 ఫిబ్రవరి 12న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ జాన‌ప‌ద చిత్రం 50 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 14 =