స్ఫూర్తిదాయక మహిళగా ఎదుగుతున్న కొణిదెల వారి కోడలు

Upasana Konidela - Lady With A Golden Heart,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Upasana Konidela,Upasana Konidela News,Upasana Konidela Latest Updates,Upasana Konidela The Beauty with Golden Heart,Ram Charan Wife Upasana Kamineni,Mega Power Star Ram Charan Wife Upasana Kamineni News

డబ్బున్న వాళ్ళ పిల్లలందరూ సోమరిపోతులు, పొగరుబోతులు, వ్యసనపరులు అనీ… డబ్బు లేని వారి పిల్లలందరూ కష్టజీవులు, నెమ్మదస్తులు, బుద్ధిమంతులు అన్నది జనసామాన్యంలో ఉన్న జనరల్ ఒపీనియన్. అయితే ఈ అభిప్రాయం అన్ని సందర్భాలలో, అందరి విషయంలో నిజం కాదన్నదే అసలు నిజం. వ్యక్తుల ప్రవర్తన, స్వభావాల మీద వారి ఆర్థిక పరిస్థితి ప్రభావం కొంత వరకు ఉండవచ్చునేమో గానీ
స్వతహాగా వారి నడక, నడతలను ప్రభావితం చేసేది మాత్రం జన్మతః వచ్చే సంస్కారం మాత్రమే. నిజానికి ఈ రోజున సమాజంలో పెరుగుతున్న విశృంఖలత్వం కారణంగా ఎక్కువగా పెడదారి పడుతుంది మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన పిల్లలే. ఉన్నత వర్గాలకు చెందిన వారి పిల్లల్లో చాలా మంది తమ తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులను, లెగసీని రెట్టింపు చేస్తూ వివిధ రంగాలలో దూసుకుపోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కళ్ళ ముందు కోట్లున్నా, విలాసవంతమైన జీవితం ఊరిస్తున్నా కొన్ని లక్ష్యాలకు, ఆశయాలకు కట్టుబడి ముందుకు సాగుతున్నారు… కన్నవాళ్ళ కళ్ళముందే వాళ్ళ కంటే గొప్పగా ఎదుగుతున్నారు. తిని కూర్చుంటే తరతరాలకు సరిపడేన్ని ఆస్తులు ఉన్నప్పటికీ తమదైన వ్యక్తిత్వం కోసం, తమదైన సంపాదన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు కొంతమంది ప్రముఖుల పిల్లలు.

డబ్బు సంపాదన కంటే ముఖ్యంగా తమకున్న కోట్లాది ఆస్తులను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు సద్వినియోగం చేస్తూ రకరకాల వినూత్నమైన కాన్సెప్ట్స్ తో సామాజిక జాగృతికి ఉద్యమిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అలాంటి సామాజిక ప్రయోజనకర కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్ఫూర్తిదాయక మహిళ శ్రీమతి ఉపాసనా కొణిదెల.

ఒక ఉన్నత కుటుంబం నుండి మరొక ఉన్నత కుటుంబానికి కోడలుగా వచ్చిన ఉపాసన రెండు కుటుంబాల
పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేస్తూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమవ్వటం అభినందనీయం.

[custom_ad]

ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని యువతలో ఉపాసన అంటే తెలియనివారు ఉండరు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అవుతున్న యూత్ మొత్తానికి ఉపాసన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలు, విలువ తెలుసు. కోటాను కోట్ల విలువ చేసే కార్పొరేట్ ఫ్యామిలీ నుండి కోట్లాది అభిమానులు కలిగిన మెగా ఫ్యామిలీ లోకి అడుగుపెట్టిన ఉపాసన ఈ రోజున “ఊరికి ఉపకారి ” గా మంచి గుర్తింపు తెచ్చుకొని అందరి అభినందనలు అందుకుంటున్నారు.

అయితే ఉపాసనకు ఈనాటి ఈ గుర్తింపు రావటానికి ముందు కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. 2012 జూన్ 14న రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి జరిగింది. కొణిదెల వారి కోడలుగా ఉపాసన అడుగుపెట్టే సమయానికి ఆమె పర్సనల్ వెయిట్ 100 కేజీలు పైనే. మెగాస్టార్ తనయుడిగా అద్భుత విజయాలు అందుకుంటూ మెరుపు తీగలా దూసుకొస్తున్న మెగా వారసుడికి ఉపాసన సరిజోడు కాదు అనే విమర్శలు విపరీతంగా వినిపించిన రోజులవి. ఆ విమర్శల నేపథ్యంలోనే మెట్టినింట అడుగుపెట్టిన ఉపాసనకు రెండు సవాళ్లు సవాలు విసిరాయి. ఒకటి.. ఓవర్ వెయిట్ తగ్గించుకుని తన శరీరాన్ని తన అదుపులోకి తెచ్చుకోవటం…రెండు … పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చేలాగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం.

అయితే వళ్ళు తగ్గించుకోవటం అనుకున్నంత ఈజీ కాదు. చిన్న వయసు నుండే అమెరికాలో పెరిగిన ఉపాసన అక్కడి చాక్లెట్స్ , బర్గర్స్ అండ్ పిజ్జాల ఫాస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా చాలా బబ్లీగా తయారైంది. కానీ పెళ్లి నేపథ్యంలో వినిపించిన విసుర్లు, విమర్శలకు చెక్ పెట్టాలి అంటే తనను తాను హింసించుకొక తప్పదు. ప్రపంచంలోని అద్భుత వంటకాల పంచభక్ష్యాలను క్షణాల్లో కళ్ళముందుకు తెప్పించుకోగల స్తోమత ఉండి కూడా క్షుద్భాధతో కడుపు ఎండ గట్టుకుని తను చేసిన నిరాహార దీక్ష వల్లనే ఈ రోజున అందాల మెరుపుతీగలాగా తయారయ్యారు ఉపాసన. అష్టైశ్వర్యాల ఉపాసన సంవత్సరాల తరబడి అన్నానికి దూరమై కేవలం ఓట్స్ తో కడుపు నింపుకుని నిర్దేశిత లక్ష్యాన్ని సాధించారు. ఇది వ్యక్తిగతంగా తన శారీరక నియంత్రణకు సంబంధించిన సవాలు. “ఖైదీ నెంబర్ 150 ” షూటింగ్ ప్రారంభానికి ముందు మెగాస్టార్ చిరంజీవి ఎలా తన ఒంటిని వింటి లాగా వంచి అద్భుతమైన మేకోవర్ తో సిద్ధమయ్యారో అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి ఆ మామకు తగ్గ కోడలు కాబట్టేనేమో ఉపాసన కూడా
నియమబద్ధమైన నియంత్రణతో అదుపుతప్పిన శరీరాన్ని అదుపాజ్ఞలలోకి తెచ్చుకుని తొలి సవాలుకు తిరుగులేని సమాధానమిచ్చారు.

ఇక రెండవది… సమాజంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకోవడం. తన అంతులేని ఐశ్వర్యానికి ఒక అర్థం పరమార్థం ఏర్పడాలి అంటే సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా వాటికి సార్థకతను కల్పించడం. అయితే డబ్బుంది కదా అని వాటిని విచ్చలవిడిగా అపాత్రదానాల పాలు చెయ్యకుండా క్యాలిక్యులేటెడ్ గా, పద్ధతి ప్రకారం సద్వినియోగం చేసే పథకాలను తయారుచేసుకున్నారు
ఉపాసన. తాత తండ్రుల నుండి నేర్చుకున్న పుట్టింటి సంస్కారాన్ని, భర్త, అత్తమామల నుండి నేర్చుకున్న మెట్టినింటి మర్యాదలను తూచా తప్పకుండా పాటిస్తూ తనను తాను సమున్నతంగా తీర్చిదిద్దుకున్నారు ఉపాసన.

వైస్ చైర్ పర్సన్ ఆఫ్ అపోలో గ్రూప్ , ఎడిటర్-ఇన్-చీఫ్ ఆఫ్ ‘బి పాజిటివ్’ మేగజైన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే డ్రైవింగ్, హార్స్ రైడింగ్, సీ డైవింగ్ , పోలో ప్లేయింగ్ వంటి క్రీడల్లో ప్రావీణ్యతను సాధించారు ఉపాసన. ఉపాసన వ్యక్తిత్వంలోని మరో అభినందనీయమైన కోణం యూనివర్సల్ లవ్. “సాటి మనిషి- వన్యప్రాణి” అనే కాన్సెప్టుతో ఉపాసన చేస్తున్న సోషల్ మూమెంట్ కు అద్భుత స్పందన లభిస్తోంది. కష్టాన్ని చెప్పుకోగలిగిన మనిషికి చేయూత ఎంత అవసరమో చెప్పుకోలేని మూగజీవాలకు సేవ అంత అవసరం అని నమ్మే ఉపాసన తన ట్వీట్స్ ద్వారా పశుపక్ష్యాదుల సంరక్షణకు గొప్ప కృషి చేస్తున్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పక్షి అయిన ‘రామచిలుక’ నిర్దాక్షిణ్య నిర్బంధంపై ఉపాసన చేసిన ట్వీట్ కు వన్యప్రాణి ప్రేమికుల నుండి విపరీతమైన స్పందన లభించింది.

మొత్తానికి వ్యక్తిగతంగా , సమాజపరంగా స్ఫూర్తిదాయకమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నత ఆశయాలు వైపు అడుగులు వేస్తున్న కొణిదెల వారి కోడలు ఉపాసనకు ఆల్ ద బెస్ట్ చెబుతోంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + eight =