‘జాను’ – ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ వీడియో సాంగ్ రిలీజ్

Jaanu, Jaanu Movie, Jaanu Movie Songs, Jaanu Songs, Jaanu Telugu Movie, Jaanu Telugu Movie Songs, Latest Telugu Movies News, Life of Ram Video Song, Life of Ram Video Song From Jaanu Out Now, Samantha, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక పాటలకు కూడా మంచి స్పందన లభిస్తుంది. ”ప్రాణం నా ప్రాణం”, ”ఊహలే ఊహలే” పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ”ది లైఫ్ ఆఫ్ రామ్” వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శర్వానంద్, సమంత మొదటిసారి జోడీ కడుతున్న ఈ మూవీ రిలీజ్ పై తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం తెలుగులో శర్వానంద్, సమంత ఏ మేరకు మెప్పిస్తారో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =