సుమ సున్నిత భావోద్వేగాల దర్శకనిర్మాత శేఖర్ కమ్ములకు హ్యాపీ బర్త్ డే

Birthday Wishes to Sekhar Kammula, Director Sekhar Kammula, Happy Birthday Sekhar Kammula, Latest Telugu Movies News, Sekhar Kammula, Sekhar Kammula Birthday, Sekhar Kammula Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Telugu FilmNagar Wishes Ace Director Sekhar Kammula A Very Happy Birthday, Tollywood Movie Updates

సినిమా అన్నది వ్యాపారమే అయినప్పటికీ దర్శకులందరూ  ఫక్తు వ్యాపారస్తుల్లాగా ఆలోచించలేరు. వ్యాపారాని కంటే నైతిక విలువలకు, సృజనాత్మక భావోద్వేగాలకు విలువ నిచ్చే దర్శకులు అతి కొద్దిమందే ఉంటారు. ర్యాట్ రేస్ లాంటి ఈ పోటీ ప్రపంచంలో అలాంటి సెన్సిటివ్ డైరెక్టర్స్ సంఖ్యాపరంగా కొంత వెనుకబ డవచ్చునేమో గాని నైతికంగా వాళ్ళు ఎప్పుడూ ముందంజలోనే ఉంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలా నైతికంగా, సృజనాత్మకంగా చాలా మంది కంటే చాలా ముందడుగు లో ఉన్న సెన్సిటివ్ అండ్ సెన్సిబిల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. శేఖర్ కమ్ముల సినిమా అనగానే  రెండున్నర గంటల సుమ సున్నిత భావోద్వేగాల సెన్సిటివ్ షో మన కళ్ళముందు కదలాడుతుంది. అనుబంధాలు, అనురాగాలు, ఆప్యాయతలు, ఆనందాలు, సున్నిత హాస్యం, సుమధుర సంగీతం, అమలిన శృంగారం వంటి దైనందిన జీవిత మాధుర్యాల మేళవింపుగా గిలిగింతలు పెడతాయి శేఖర్ కమ్ముల సినిమాలు. అందుకే శేఖర్ కమ్ముల సినిమాను జయాపజయాలకు అతీతమైన స్కేలింగ్ తో,  ఫీలింగ్ తో చూస్తారు ప్రేక్షకులు. బాక్స్ ఆఫీసు వద్ద అద్భుత విజయాలుగా నిలిచిన ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా వంటి చిత్రాలకు ఎంత రెస్పెక్ట్ ఉందో కాసుల వేటలో వెనకబడ్డ గోదావరి, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలకు కూడా అంతే గౌరవం దక్కింది. అంటే వ్యాపార విజయానికంటే అతీతమైన నైతిక విజయం ఎప్పుడూ  శేఖర్ కమ్ముల వెన్నంటే ఉంది. దర్శకుడిగా తన 20 సంవత్సరాల కెరీర్లో చేసింది కేవలం పది చిత్రాలే అయినప్పటికీ
పొందిన గుర్తింపు, సాధించుకున్న పాపులారిటీ, గెలుచుకున్న అవార్డులు, నిలుపుకున్న గౌరవం విషయంలో శేఖర్ కమ్ములను సుసంపన్నుడిగా అభినందించవచ్చు. అలా అతి తక్కువ సినిమాలతో అత్యంత గౌరవ ప్రతిష్టలను సాధించుకున్న శేఖర్ కమ్ముల జన్మదినం ఈ రోజు.

[custom_ad]

1972 ఫిబ్రవరి 4న జన్మించిన శేఖర్ కమ్ముల ఈరోజుతో 49వ పడిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ములకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన retrospective నుండి ఎనిమిది సినిమాలను సెలెక్ట్ చేసి వాటిలో The Best of Sekhar Kammula ఏదో చెప్పండి అంటూ మిమ్ములను ఈ పోల్ గేమ్ కు ఆహ్వానిస్తున్నాం.

So…Your voting is your greeting.. కింద ఇచ్చిన జాబితా నుండి మీకు నచ్చిన మీ అభిమాన దర్శకుడు శేఖర్ కమ్ముల బెస్ట్ ఫిలిం ఏదో నిర్ణయించండి.

సుమ సున్నిత భావోద్వేగాల దర్శకనిర్మాత శేఖర్ కమ్ములకు హ్యాపీ బర్త్ డే

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =